బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. ఈరోజు మధ్యాహ్నం ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్‌కు వెళ్లిన కేటీఆర్… ఆయనతో పలు అంశాలు చర్చించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్‌తో కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్ఎస్లో అంతర్గతంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, ఎమ్మెల్సీ కవిత లేఖ, ఆ తర్వాత ఆమె చేసిన కామెంట్స్‌పై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తోంది.

