
తన పుట్టిన రోజు సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. భార్య శైలిమ, కుమారుడు హిమాన్షుతో ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న కేటీఆర్, తన తల్లిదండ్రులను కలిసి వారికి పాదాభివందనం చేశారు.ఈ సందర్భంగా వారు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కేసీఆర్,శోభమ్మ దంపతులు కేటీఆర్‌ను ఆశీర్వదించారు.