మరో జాలరికి లక్ తగిలింది. అతని వలలో అచ్చమైన పులస పడింది. యానాం ప్రాంతానికి చెందిన మత్స్యకారుడు మల్లాడి ప్రసాద్ మాత్రం ఏటా ఒకసారి లక్కీగా మారిపోతున్నాడు! ఈసారి కూడా ఆయన వలలో పడిన చేప వేలంలో భారీ రేటు పలికింది. శనివారం యానాం రాజీవ్ బీచ్ వద్ద నిర్వహించిన చేపల వేలంలో.. కేజీన్నర బరువున్న పులస చేప ఏకంగా రూ.22 వేలకు అమ్ముడైంది. పొన్నమండ రత్నం అనే మహిళ ఈ చేపను వేలంలో కొనుగోలు చేశారు.

