ఈనెల 11న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్సియల్ స్కూళ్లలో చదివే టెన్త్ క్లాస్ విద్యార్థినీ,
విద్యార్థులకు భారీ ఎత్తున సైకిళ్లను పంపిణీ చేసేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇప్పటికే సైకిళ్లను కూడా ఆర్డర్ ఇచ్చారు. తన పార్లమెంట్ పరిధిలో 9,348 మంది బాలబాలికలు టెన్త్ క్లాస్ అభ్యసిస్తున్నారు.

