
కేంద్రం విపక్షాలపై పొలిటికల్ అస్త్రాన్ని ప్రయోగించింది. పాకిస్తాన్తో తీవ్ర ఉద్రిక్తతల వేళ దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటు కులగణన చేస్తామని ప్రకటించింది. కులగణనపై అధికార , విపక్షాల మధ్య క్రెడిట్ వార్ మొదలయ్యింది. కులగణన మోదీ ప్రభుత్వం తీసుకున్న చారిత్మాత్మక నిర్ణయమని బీజేపీ నేతలు ప్రకటించారు. కులగణన పేరుతో కాంగ్రెస్ రాజకీయం చేసిందన్నారు.అణగారిన వర్గాలకు న్యాయం చేయడానికి మోదీ కులగణన చేపట్టారని బీజేపీ నేతలు ప్రశంసిస్తుంటే, ఇదంతా రాహుల్ కృషి అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.