జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం కాగా, BRS అభ్యర్థి మాగంటి సునీత తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సోమాజిగూడ డివిజన్ లోని ఎల్లారెడ్డి గూడ నవోదయ కాలనీలో ఆమె కుమారుడు, ఇద్దరు కుమార్తెలతో కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. గోపీనాథ్ ఆకస్మికంగా మృతిచెందడంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్.. మాగంటి గోపీనాథ్ రెండో భార్య మాగంటి సునీతకు అవకాశం ఇచ్చారు.

