ఇరాన్‌తో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, ఇరాక్ గగనతలంలో అమెరికాకు చెందిన KC-135 ఏరియల్ రీఫ్యూయలింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ కుప్పకూలింది. యుద్ధ విమానాలకు గాలిలోనే ఇంధనాన్ని నింపే ఈ భారీ విమానం ప్రమాదానికి గురవ్వడం కలకలం సృష్టిస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ విమానంలో ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఘటనా స్థలంలో అమెరికా రక్షణ బలగాలు భారీ ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. శత్రు దేశాల కాల్పుల వల్ల కానీ, లేదా ‘ఫ్రెండ్లీ ఫైర్’ వల్ల కానీ కూలిపోలేదని అమెరికా స్పష్టం చేసింది

