
కుప్పం ఘటన బాధిత మహిళకు సీఎం చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి పరామర్శించారు. శిరీషా.. ప్రభుత్వం నీతో ఉంది నువ్వు భయపడవద్దు. ప్రభుత్వం నిన్ను అన్ని విధాలా ఆదుకుంటుంది. నీకు పూర్తిగా అండగా ఉంటాము” అని ముఖ్యమంత్రి శిరీషకు భరోసా ఇచ్చారు శిరీషకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే మూగ్గురు పిల్లల చదువుకు కావలసిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు.