
అమెరికా నిఘా సంస్థలు దిగ్భ్రాంతికరమైన విషయాన్ని వెల్లడించాయి. భారత సంతతికి చెందిన ప్రముఖ అమెరికా విశ్లేషకుడు, దక్షిణాసియా విధానంపై అమెరికా విదేశాంగ శాఖ ఉద్యోగి, సలహాదారుడు ఆష్లే టెల్లిస్ రహస్య పత్రాలను దాచిపెట్టి చైనా ప్రభుత్వ అధికారులను కలిశాడనే ఆరోపణలపై అరెస్టు అయ్యారు.విదేశాంగ శాఖలో సీనియర్ సలహాదారుగా, యుద్ధ శాఖ కోసం కాంట్రాక్టర్‌గా పనిచేసిన టెల్లిస్, రహస్య పత్రాలను చట్టవిరుద్ధంగా నిల్వ చేశాడని అమెరికా న్యాయ శాఖ పేర్కొంది.