
బనకచర్ల అంశంపై తెలంగాణలో సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారు.. దాన్నో రాజకీయ అంశంగా చేసుకుంటున్నారని నారా లోకేష్ విమర్శించారు. దిగువ రాష్ట్రం.. సముద్రంలోకి పోయే నీళ్లను మళ్లించుకుంటే ఎందుకు వివాదం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన నారా లోకేష్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ప్రారంభించినప్పుడు అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించారు. దిగువ రాష్ట్రంలో ప్రాజెక్టు కడితే ఎగువ రాష్ట్రానికి ఎలా నష్టం జరుగుతుందని ప్రశ్నించారు.