ఆంధ్రప్రదేశ్తో పాటు పొరుగు రాష్ట్రాల సరకు రవాణాను నిర్వహించేందుకు లాజిస్టిక్స్ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఓడరేవులు, విమానాశ్రయాలు, రహదారులు, రైలు, అంతర్గత జల రవాణా మార్గాల ద్వారా చేపట్టే సరకు రవాణాను ఈ కార్పోరేషన్ ద్వారానే నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాలపై సమీక్షించారు.సోమవారం రాష్ట్ర సచివాలయంలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాలపై సమీక్షించారు.

