‘మాజీమంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి బాధాకరం. ఇళ్లమీద దాడి చేయడం సరికాదు’అని ముద్రగడ పద్మనాభం హితవు పలికారు. ‘మేము (కాపు) బానిసలం కాదు.. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మేము రాలేదు. కాపుల సహకారంతో రెండు సార్లు అధికారం చేపట్టి, రెండుసార్లు కాపులను అవమానించారు. మొదటి సారి నన్ను, నా కుటుంబాన్ని హింసించి పచ్చి భూతులు తిట్టారు. ఇప్పుడు అంబటి రాంబాబుని హింసించారు’అని ముద్రగడ పద్మనాభం కీలక వ్యాఖ్యలు చేశారు.

