
కాకినాడ జిల్లా సామర్లకోటలో బాలుడిని కానిస్టేబుల్ చితకబాదాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. బాలుడు అక్షయ్‌తో సతీష్ అనే కానిస్టేబుల్ గొడవకు దిగాడు. కోపంతో రగిలిపోయిన కానిస్టేబుల్ బాలుడిని విచాక్షణరహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాలుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం బాలుడిని కాకినాడ ఆస్పత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. బాలుడిని చితకబాదిని కానిస్టేబుల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు, స్థానికులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు.