
బోనకల్లు మండల పరిధిలోనే గోవిందాపురం ఎల్ గ్రామానికి చెందిన 60 నిరుపేద కుటుంబాలు తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డే లో సోమవారం ఫిర్యాదు చేశారు. ఇందిరమ్మ గ్రామ కమిటీల పేరుతో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారని, అనేక ఏళ్లుగా పూరి గుడిసెల్లో నివాసం ఉంటూ సెంటు భూమి కూడా లేని వారికి ఇల్లు మంజూరు చేయలేదని వినతి పత్రంలో పేర్కొన్నారు.