చర్చల ద్వారానే ఏ సమస్యకైనా పరిష్కారం సాధ్యమని.. తుపాకులతో కాదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. పార్లమెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. మాట్లాడితే ప్రజాస్వామ్యం అంటారు కానీ హింసను ఎలా సమర్థిస్తారు అని ప్రశ్నించారు. నక్సలిజం నశించాలని గిరిజనులు కూడా కోరుకుంటున్నారని అమిత్ షా స్పష్టం చేశారు. ఆయుధాలు చేతుల్లోకి తీసుకోవడం ఏ సమస్యకూ పరిష్కారం కాదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచే నక్సలిజం అభివృద్ధి చెందింది. ఇందిరా గాంధీ వల్లే మావోయిస్టు పార్టీ అన్ని ప్రాంతాలకు విస్తరించింది’’ అని అమిషా ధ్వజమెత్తారు.

