ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల వల్ల తలెత్తే ప్రభావాలు దేశ ప్రజలపై పడకుండా కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అన్నారు. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం దేశంలో భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తూ, చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అసోంలోని సిల్చార్లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన మోదీ, కాంగ్రెస్ ఈశాన్య రాష్ట్రాలను తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు.

