బడికి వెళ్లని అందె శ్రీ.. జయ జయ హే తెలంగాణ గీతం రాసిన చరిత్ర తెలంగాణకు ఉందని, ‘బాధతో.. ఉద్వేగంతో చెప్తున్నా.. తెలంగాణ రాష్ట్ర ప్రజలు జయ జయ హే తెలంగాణ పాటకు గౌరవం దక్కాలని కోరుకున్నారు. సమాజంలో ఎన్ని వజ్రాలు ఉన్నా కోహినూర్ వజ్రానిదే అసలైన గొప్పతనం.. అలాగే కళాకారులు ఎంతమంది ఉన్నా అందె శ్రీ అన్న.. కోహినూర్ వజ్రంలా నిలుస్తారని హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన కవి దివంగత శ్రీ అందెశ్రీ సంస్మరణ సభలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

