టీఆర్ఎస్ పేరుతో కవిత ఏర్పాటు చేసిన పార్టీపై బీఆర్ఎస్ స్పందించింది. ఆ పార్టీ పేరు చెప్పకుండానే ట్రోలింగ్ మొదలు పెట్టింది. రెండు బ్రాండ్లకు సంబంధించిన నకిలీ ప్రొడక్ట్స్‌ను పోస్టు చేసి ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అంటూ కామెంట్ చేసింది. బీఆర్ఎస్ చేసిన పోస్టు పెట్టిన వెంటనే కవితపై ట్రోలింగ్ మొదలైంది. తీవ్ర స్థాయిలో కవితపై నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. షర్మిల, కవిత ఫొటోలను పక్క పక్కనే పెట్టి ట్రోల్ చేస్తున్నారు. జయలలిత గెటప్ కాపీ, షర్మిలా చీర కాపీ, టీఆర్ఎస్ పేరు కాపీ అంటూ విమర్శలు చేస్తున్నారు.

