టీటీడీ (TTD) కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) కడూరు చిన్న అప్పన్న ను సిట్ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో అతనికి ఉన్న సంబంధాలపై సిట్ సుదీర్ఘ విచారణ జరిపి, ఆధారాల ఆధారంగా అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేయడంలో ఇతను కీలక పాత్ర పోషించాడని సిట్ అధికారులు భావిస్తున్నారు.

