
కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని కుమత తాలూకులో రామతీర్థ కొండల్లోని ఒక గుహలో మనుషులు నివసిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందడంతో తనిఖీలు చేశారు. ఓ తల్లి, ఇద్దరు కూతుళ్లతో ఉండటం గమనించారు గుహలో జీవిస్తున్న మహిళ పేరు నీనా కుటినాగా పోలీసులు తెలుసుకున్నారు. ఆమె రష్యా నుండి భారతదేశానికి బిజినెస్ వీసాపై వచ్చింది, ఆ వీసా 2017 ఏప్రిల్లో గడువు ముగిసింది. ఆమె ఎనిమిది సంవత్సరాలుగా భారతదేశంలో అనధికారికంగా ఉంటోంది.