్రీసత్యసాయి జిల్లా కదిరిలో వెలసిన శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మ రథోత్సవంలో విషాదం చోటుచేసుకుంది. అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ వేడుకలో రథాన్ని లాగుతున్న సమయంలో ఒక్కసారిగా అపశృతి. వేలాదిగా తరలివచ్చిన భక్తుల మధ్య రథం కదులుతుండగా, ఓ భక్తుడు ప్రమాదవశాత్తూ రథం చక్రం కింద పడిపోయాడు. సదరు భక్తుడికి తీవ్ర గాయాలవ్వడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన వ్యక్తిని కాపాడే ప్రయత్నంలో మరో ఐదుగురు భక్తులు కూడా గాయపడ్డారు.

