ఓట్ చోరీ ఆరోపణల నేపథ్యంలో విజయవాడలో కాంగ్రెస్ పార్టీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. దొంగ ఓట్లతో నరేంద్రమోడీ మూడోసారి అధికారంలోకి వచ్చారు. ఓట్లు చోరీ విషయంలో ప్రధాని మోడీనే అసలు గజ దొంగ అని ఆరోపించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాట్ లైన్‌లో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారని వైఎస్ జగన్ అనడం హాస్యాస్పదంగా ఉంది అని , జగన్ తన పార్టీలో అరెస్ట్ అయిన నేతలను చూడటానికి వెళ్లి తలకాయలు తొక్కించేసినట్టుగా రాహుల్ గాంధీ వ్యవహారం ఉండదు అని ధ్వజమెత్తారు.

