పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని టీడీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటు కోసం డబ్బులు పంపిణీ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
కొత్తపల్లి, నల్లపరెడ్డిపల్లె, ఎర్రిపల్లి, నల్లగొండువారిపల్లెలలో టీడీపీ నేతలు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్ స్లిప్లను లాక్కుంటున్నారని ఆరోపించారు.ఓటుకు పది వేల రూపాయలు ఆశ చూపుతున్నారు. స్లిప్లు ఇవ్వకపోతే ఓటర్లను బెదిరిస్తున్నారు. అంతేకాదు, వైసీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడతామని టీడీపీ కార్యకర్తలు బెదిరిస్తున్నట్టు సమాచారం ఉంది, అని అన్నారు.

