విక్టరీ వెంకటేశ్ హీరోగా ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాని ఈరోజు (మార్చి 1) సాయంత్రం నుంచి ‘జీ 5’ ఓటీటీలో స్ట్రీమింగ్ కు పెట్టారు. తెలుగుతో పాటుగా హిందీ, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లోనూ ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అదే సమయంలో ‘జీ తెలుగు’ టెలివిజన్ ఛానల్ లోనూ టెలికాస్ట్ చేసారు

