
AI రంగంలో చైనా, అమెరికా మధ్య సాంకేతిక యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పని ఒత్తిడి కారణంగా ఐదుగురు చైనా AI శాస్త్రవేత్తలు అకాల మరణం చెందినట్లు ఒక చైనీస్ మీడియా వెల్లడించినట్లు తెలుస్తోంది.. ఈ సంవత్సరం,ప్రమాదం లేదా అనారోగ్యం కారణంగా ఐదుగురు అగ్రశ్రేణి AI శాస్త్రవేత్తలు అకాల మరణాలు వారి వ్యక్తిగత భద్రతతో పాటు ఒత్తిడితో కూడిన పరిశోధన వాతావరణం గురించి ఆందోళనలను రేకెత్తిస్తాయని నివేదిక పేర్కొంది. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది అమెరికాలో చదువుకుని, పని కోసం చైనాకు తిరిగి వచ్చినవారేనని నివేదిక వెల్లడించింది.