ఒడిశాలో కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా ఓటు వేసిన ముగ్గురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. సోమవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రమేశ్ చంద్ర జెనా, దశరథి గోమాంగో, సోఫియా ఫిర్డోస్ బీజేపీ మద్దతుతో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి దిలీప్ రాయ్‌కు ఓటు వేశారు.ఒడిశా కాంగ్రెస్ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ మాట్లాడుతూ, ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఇలాంటి చర్యలకు పాల్పడతారని ఊహించలేదన్నారు.

