పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా పెను మార్పులకు దారితీస్తున్నాయి అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. ఈ ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రధాన సూచీ అయిన సెన్సెక్స్ ఏకంగా 1,958.04 పాయింట్లు (2.63 శాతం) నష్టపోయి 72,574.92 వద్ద స్థిరపడింది. అదేవిధంగా, నిఫ్టీ కూడా 629.65 పాయింట్లు (2.72 శాతం) క్షీణించి 22,484.85 వద్దకు చేరుకుంది. మన మార్కెట్ల కంటే ముందే ఆసియా మార్కెట్లు కుప్పకూలాయి.

