
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో కీలకమైన 12 అంశాలపై చర్చించాము. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు 16, 17, 18 తేదీలలో మూడు రోజులు అన్ని నియోజకవర్గాల్లో తిరంగ ర్యాలీలు జరపాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. ‘తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమానికి…ఇబ్బందులుంటే ఆదుకోవడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాం, మే నెలాఖరుకు పార్టీ సంస్థాగత ఎన్నికలన్నింటిని పూర్తి చేస్తాం అని అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.