
తింజియన్ షాంఘై సహకార సదస్సు ప్రొసీడింగ్స్ ముగిసిన తర్వాత భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారంనాడు ఒకే కారులో ప్రయాణించారు. ‘ఎస్‌సీఓ సదస్సు వేదిక వద్ద ప్రొసీడింగ్ పూర్తయిన తర్వాత అధ్యక్షుడు పుతిన్, నేను కలిసి ఒకే కారులో ద్వైపాక్షిక భేటీ వేదికకు చేరుకున్నాం. ఇద్దరి మధ్య ఎప్పుడూ చాలా లోతైన చర్చలు ఉంటాయి’ అని మోదీ తెలిపారు. ఇద్దరూ కారులో ప్రయాణిస్తున్న ఫోటోను కూడా ఆయన షేర్ చేశారు.