టీ20 క్రికెట్‌లో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న సంజూ శాంసన్ రికార్డుల మోత మోగించాడు. అహ్మదాబాద్ టీ20లో ఓపెనర్‌గా ఉన్నంత సేపు దంచేసిన సంజూ.. అంతర్జాతీయంగా వెయ్యి పరుగుల క్లబ్‌లో చేరాడు. టీమిండియా తరఫున టీ20ల్లో అత్యంత వేగంగా 1,000 రన్స్ పూర్తి చేసుకున్న నాలుగో బ్యాటర్‌గా నిలిచాడీ లెఫ్ట్ హ్యాండర్. 679 బంతుల్లోనే ఈ మైలురాయికి చేరుకున్న సంజూ మాజీ సారథి హార్దిక్ పాండ్యా రికార్డు సమం చేశాడు.

