రాష్ట్రంలో రానున్న రెండు రోజులపాటు విభిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడనున్నాయి. రేపు, ఎల్లుండి కొన్ని జిల్లాల్లో తీవ్ర ఎండలు, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. అవేర్ ప్లాట్ ఫారం ద్వారా 4,5 రోజుల్లో వేసవి తీవ్రత ఎలా ఉంటుందన్న సమాచారం ముందే తెలుసుకునే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. వాతావరణ కేంద్రాల ద్వారా అందే సమాచారం ఆధారంగా ఏ ప్రాంతాల్లో వేసవి తీవ్రత ఎక్కువగా ఉoదో గుర్తిస్తారు.

