ఐపీఎల్ మ్యాచ్ ఓ బాలింత మరణానికి కారణమైంది.5వ తేదీన ఉప్పల్ లో జరిగిన మ్యాచ్ అనంతరం, ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో మహిళ ప్రాణాలు కోల్పోయింది. బట్టల దుకాణంలో పనిచేస్తున్న బిష్ణకు గుండెపోటు రాగా సమీపంలోని ఆస్రృతి డాక్టర్లు నిమ్స్ కు రిఫర్ చేశారు. బిష్ణను అంబులెన్స్ లో తరలిస్తుండగా ఉప్పల్ లో గంటకు పైగా అంబులెన్స్ ట్రాఫిక్ లో చిక్కుకుపోవడంతో ఆక్సిజన్ అయిపోయి బిష్ణ తుది శ్వాస విడిచింది. ఆమె ముగ్గురు పిల్లలు తల్లిలేని అనాథలయ్యారు. మహిళకు 26 రోజుల పాప ఉంది.

