హైదరాబాద్ టోలిచౌకి పోలీసులు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నారు. నలుగురు యువకులు రాత్రి పూట ఎలాంటి కారణం లేకుండా రోడ్డు మీద తిరుగుతున్నారని..ఆ నలుగురిపై చిన్న కేసులు నమోదు చేశారు రాత్రివేళ బయట తిరిగినంత మాత్రాన కేసులు ఎలా పెడతారని నెటిజన్లు ప్రశ్నించారు. అలాంటి నిబంధన ఏ చట్టంలో ఉందని పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ యువకులు ఇంతకుముందే పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారని టోలిచౌకి పోలీసులు క్లారిటీ ఇచ్చారు

