ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన ఘటనపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది . పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించింది.పుట్టా మహేష్ వివరణ కోరుతూ నోటీసులు ఇవ్వాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌కు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. డ్రగ్స్ కేసులో మహేష్ పట్టుబడిన అంశంపై నివేదిక ఇవ్వాలని వెల్లడించారు. డ్రగ్స్ వంటి ఘటనల్లో ఎవరూ ఉన్నా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

