ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఇమామ్, మౌజమ్‌లకు రంజాన్ కానుక ప్రకటించింది. ఇమామ్, మౌజమ్‌లకు చెల్లించాల్సిన బకాయిలు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున విజయవాడలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రార్ధనల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షించి.. వాటిని ముస్లిం వర్గాల సంక్షేమానికి ఖర్చు చేస్తామని చంద్రబాబు తెలిపారు

