
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరుపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూసేలా చేశారుగా అంటూ ప్రభుత్వ పెద్దలను అభినందించారు. జూన్ 21న యోగా డే సందర్భంగా విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 5 లక్షల మందికి పైగా జనాలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం పాల్గొంటున్నారు.