ఆంధ్రప్రదేశ్ టెట్ 2025 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఫలితాలను వెల్లడించింది. తాజా టెట్ పలితాల్లో 97,560 మంది ఉత్తీర్ణత సాధించినట్లు కన్వీనర్ వెల్లడించారు. అంటే మొత్తం 2,71,692 మందిలో 39.27 శాతం మంది మాత్రమే అర్హత ఉత్తీర్ణత సాధించారన్నమాట. గతంతో పోల్చితే టెట్ ఉత్తీర్ణత ఈసారి భారీగా తగ్గింది. 31,886 మంది ఇన్ సర్వీసు ఉపాధ్యాయులలో 15,239 మంది టెట్‌లో ఉత్తీర్ణులైనారు. టెట్ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌తోపాటు 9552300009 వాట్సప్ నెంబర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.

