
ఏపీలో నకిలీ మద్యాన్ని వ్యవస్థీకృత పద్ధతిలో అమ్ముతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు కనిపిస్తున్నాయి. తమ మాఫియా లిక్కర్ షాపుల ద్వారా నకిలీ మద్యాన్ని అమ్ముతున్నారు. “విజయవాడలో.. సీపీ పర్యవేక్షణలో నకిలీ మద్యం సాగుతోంది. ఏపీలో కొన్ని లక్షల బాటిళ్ల నకిలీ మద్యం తయారుచేసి అమ్ముతున్నారు. ఇలా చెయ్యడం చంద్రబాబు, నారా లోకేష్ వల్లే సాధ్యం” అని జగన్ అన్నారు.అమ్మేవాళ్లంతా చంద్రబాబు లిక్కర్ సిండికేటే అయినప్పుడు.. ఇక వాళ్లు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఏం లాభమని జగన్ ప్రశ్నించారు.