
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భుత్వం ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. 175 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రణాళికా శాఖలో ఖాళీగా ఉన్న 175 యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు సంబంధించిన విజన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పన, ప్రభుత్వ P4 కార్యక్రమాల సమన్వయం కోసం ఈ నియామకాలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.