ఆంధ్రప్రదేశ్ లో ఇకపై నమో అంటే నరేంద్ర మోడీ కాదు… నాయుడు అండ్ మోడీ. ఇద్దరు సమర్థ నేతల నేతృత్వాన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన యుఎస్ – ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ సమ్మిట్లో మంత్రి లోకేశ్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు మా లక్ష్యం $2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ’అని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.

