ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పాలనా యంత్రాంగంలో కీలక మార్పులు చేపట్టింది. పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్గా టి.నిశాంతి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్గా అభిషిక్త్ కిశోర్ బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే, గుంటూరు జిల్లా కలెక్టర్గా సాయికాంత్ వర్మ, కాకినాడ జిల్లా కలెక్టర్గా హరేంద్ర ప్రసాద్ నియమితులయ్యారు.

