
ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (APTS)లో 6 జిల్లాలకు గాను జిల్లా ఐటీ మేనేజర్ పోస్టులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు బీటెక్ లేదా ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపింది. ఎంబీఏ చదివిన వారికి అధిక ప్రాధాన్యత ఉంటుంది అని తెలిపింది. అలాగే సంబంధిత పోస్టుకు సంబంధించి 3ఏళ్లు అనుభవం తప్పనిసరి అని నోటిఫికేషన్లో పేర్కొంది. 01-07-2025 నాటికి 18 నుంచి 42 ఏళ్ల వయసు కలిగిన వారు ఆన్ లైన్లో https://apts.gov.in/careers దరఖాస్తు చేసుకోవచ్చు.