ప్రముఖ సెర్చింజన్ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ చెప్పే ప్రతి సమాధానాన్ని గుడ్డిగా నమ్మొద్దని హెచ్చరించారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఏఐ మోడళ్లలో కూడా లోపాలు ఉంటాయని.. కాబట్టి ఇతర టూల్స్తోనూ ధ్రువీకరించుకోవాలని స్పష్టం చేశారు. ఈ ఏఐ బుడగ పేలితే.. అన్ని కంపెనీలపైనా ప్రభావం తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నారు.

