సిద్దార్థ అకాడమీ విద్యా సంస్థల స్వర్ణోత్సవాల్లో ముఖ్య అతిథిగా చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అమరావతిని ఎవరూ కదపలేరని, ‘కొందరి అసూయకు హద్దు లేకుండా పోతోంది. గత పాలనలో అమరావతిని ఆపేయాలని కుట్రలు చేస్తే ఏమయ్యారో చూశాం. అయినా బుద్ధి రాలేదు. అమరావతి నదీ పరివాహక ప్రాంతంలో నిర్మిస్తున్నారని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీ, చెన్నై, విశాఖ, నెల్లూరు, రాజమండ్రి ఎక్కడున్నాయో వారికి తెలియదా? ఎక్కడ నీరు ఉంటే అక్కడ నాగరికత అభివృద్ధి చెందుతుంది.’ అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.‘

