
గద్వాలలో నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ..మరి ఇవాళ ఎవరి అభివృద్ధి కోసం కాంగ్రెస్‌లోకి వెళ్లావని కృష్ణమోహన్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమా? నీ సొంత అభివృద్ధి కోసమా? ఎందుకు పార్టీ మారవని నిలదీశారు. ఈ 22 నెలల్లో గద్వాలలో ఏం అభివృద్ధి జరిగిందని అడిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఫాంతో పోటీచేసి గెలిచాక కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా.. అధికార పార్టీకి పెద్ద ఎత్తున పలువురు నాయకులు గుడ్‌బై చెప్పి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.