
2023లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా తమ నామినేషన్లను అప్పటి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలు తొలుత హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాల కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. అయితే కోర్టు మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉన్నప్పుడు కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయడాన్ని సుప్రీం ధర్మాసనం తాజాగా తప్పుబట్టింది.