
గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచల నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ఆయన ప్రకటించారు. రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ అందజేశారు. బీజేపీ అధ్యక్ష పదవికి తన సిఫార్సు చేసిన అభ్యర్థిని పార్టీ నాయకత్వం పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో ఆయన, పార్టీని వీడేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.