
టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. సుమారుగా 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి గైర్హాజరు అయినట్లు సమాచారం. దీనిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి డుమ్మా కొట్టి.. విదేళాల్లో ఎమ్మెల్యేలు ఉండటంపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉండటం సరికాదని వార్నింగ్ ఇచ్చారు. పార్టీ సమావేశానికి ఆహ్వానించిన వారిలో 56మంది గైర్హాజరు కావటంపైనా చంద్రబాబు అసహనం వ్యక్తంచేశారు.