ప్రజలు తమ సమస్యలను స్వేచ్ఛగా చెప్పుకుని, సమాధానం నుంచి కోరుకునే అవకాశం ఉండాలని మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఎపిలో ప్రజాస్వామ్య ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందని అన్నారు. ఎపిలో జరుగుతున్న అణచివేతలపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రశ్నించే గొంతులను నులిమేస్తున్నారంటూ జగన్ ట్వీట్ చేశారు. ఎపి సిఎం చంద్రబాబు నాయుడు నిరంకుశ పాలనలో అడ్డగోలుగా అణచివేయపడుతోందని,
పోలీసులతో అధికార దుర్వినియోగం చేయిస్తూ, అసమ్మతి గళాలను నులిమేస్తున్నారని మండిపడ్డారు.

