ఎన్నికలు జరుగుతున్నప్పుడు మాత్రమే ప్రతిపక్ష నేతలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేయడంపై స్వతంత్ర రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ (Kapil Sibal) ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల అధికార పరిధికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న రివ్యూ పిటిషన్లను విచారించాలని సుప్రీంకోర్టును కోరారు. పశ్చిమ బెంగాల్లో ఈడీ చర్య వెనుక ఏకైక ఉద్దేశం ప్రతిపక్ష నాయకులను వేధించడమేనని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్, బీహార్‌లో లాలూ ప్రసాద్, తేజస్వి యాదవ్‌లపై ఈడీ చర్యలను ఆయన ఉదాహరించారు.

